క్రైమ్/లీగల్

కేంద్రం అప్పీలుకు బదులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుకు సమాధానం ఇవ్వవలసిందిగా ఈ కేసులోని మరణ శిక్ష పడిన నలుగురు ముద్దాయిలను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నలుగురు ముద్దాయిలకు విధించిన ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే, ఈ నలుగురు నిందితులకు ఉరిశిక్షను అమలు చేయడానికి మళ్లీ తేదీని నిర్ణయిస్తూ వారంట్లు జారీ చేయవలసిందిగా ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛను సుప్రీంకోర్టు అధికారులకు ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్.్భనుమతి నేతృత్వంలో న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఏఎస్ బొపన్నలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు తన ముందు పెండింగ్‌లో ఉండటం ట్రయల్ కోర్టు ముద్దాయిల ఉరి శిక్ష అమలుకు తాజా వారంట్లు జారీ చేయడానికి ప్రతిబంధకం కాబోదని స్పష్టం చేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ ముద్దాయిలను ఉరితీయడం అనేది ‘వినోదం’ కోసం కాదని, అధికారులు కేవలం చట్టాన్ని మాత్రమే అమలు చేస్తున్నారని అన్నారు. ముద్దాయిలు తమ ఉరితీతను జాప్యం చేయడానికి ఉద్దేశపూర్వకంగా యుక్తితో వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ, నలుగురు ముద్దాయిల్లో ముగ్గురు ముద్దాయిలకు న్యాయపరంగా ఉపశమనం కలిగించడానికి ఉన్న అన్ని అవకాశాలు ముగిసిపోయాయని, మరో ముద్దాయి పవన్ గుప్తా ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయలేదని, రాష్టప్రతికి క్షమాభిక్ష కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదని ఆయన వివరించారు. ముద్దాయిలు దాఖలు చేసుకున్న అప్పీళ్లను కోర్టు 2017లోనే కొట్టివేసినప్పటికీ, అధికారులు వారి ఉరిశిక్షను అమలు చేయడానికి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. హైదరాబాద్ శివార్లలో దిశ గ్యాంగ్‌రేప్, హత్య కేసులోని నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తరువాత ప్రజలు ఆనందోత్సాహాలను వ్యక్తం చేసిన విషయాన్ని మెహతా ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు.