క్రైమ్/లీగల్

రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, ఫిబ్రవరి 11: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని కేపీహెచ్‌బీ పోలీసులు, ఎస్ ఓటీ పోలీసులు దాడి చేసి నాలుగు లక్షల విలువ చేసే రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.... వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండడంతో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కేపీహెచ్‌బీ బస్టాప్‌లో నాలుగు లక్షల విలువైన 26190 కిలోల బియ్యం లోడుతో కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన కాలిద్ మిలియాన్ డ్రైవర్ పట్టుపడ్డారు. దీంతో అతనిని విచారించగా తనకే ఎలాంటి సంబంధం లేదని ఖైరుద్దీన్ అలియాస్ ఇలియాజ్ సూచనల మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో రేషన్ డీలర్ల నుంచి తక్కువ ధరకే బియ్యం విక్రయించి కర్ణాటక రాఫ్ట్రంలొ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నాలుగు లక్షల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.