క్రైమ్/లీగల్

‘దిశ’కు సమాచారం..తక్షణమే స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 11: బస్సులో తోటి ప్రయాణీకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని దిశ యాప్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... సోమవారం రాత్రి విశాఖపట్నం నుండి విజయవాడ వెళుతున్న బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ పట్ల ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. మంగళవారం తెల్లవారుజామున 4.21 గంటల సమయంలో ఆమె తన మొబైల్ ఫోన్ ద్వారా దిశ యాప్ ద్వారా వేధింపుల సమాచారాన్ని పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న మంగళగిరిలోని దిశ హెడ్‌క్వార్టర్ సిబ్బంది సమాచారాన్ని ఏలూరు పోలీసులకు అందించారు. వెంటనే స్పందించిన ఏలూరు పోలీసులు జీపీఎస్ ఆధారంగా పెదపాడు మండలం కలపర్రు టోలుగేటు సమీపంలో బస్సును గుర్తించి, నిలుపుచేశారు. బస్సులోని ఆకతాయి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.మహిళ ఫిర్యాదు ఆధారంగా ఏలూరు త్రీటౌన్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. అనంతరం పెదపాడు పోలీసు స్టేషన్‌కు కేసు బదిలీచేశారు. నిందితుడిని విశాఖకు చెందిన కాలోతు బసవయ్య నాయక్‌గా గుర్తించారు. నిముషాల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసుల పనితీరును ప్రజలు ప్రశంసించారు.
*చిత్రం...నిందితుడు కాలోతు బసవయ్య