క్రైమ్/లీగల్

ఏపీ సీఎం జగన్‌కు మినహాయంపునివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సీబీఐ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుండి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మినహాయింపును ఇవ్వొద్దని సీబీఐ బుధవారం హైకోర్టును కోరింది. ఈ మేరకు సీబీఐ లిఖిత పూర్వకంగా అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్మోహన్‌రెడ్డి న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ వాదనలను తిప్పికొడుతూ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తిని ఆమోదించవద్దని సీబీఐ కోరింది. ఇరు పక్షాల వాదలను నమో దు చేసిన హైకోర్టు తదుపరి విచారణను
ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. సీఎం హోదాలో అధికారిక విధుల్లో పాల్గొనాల్సి ఉండటం, ప్రతి వారం హైదరాబాద్ కోర్టులో హాజరుకావడం అంటే ప్రభుత్వానికి పెనుభారంగా మారనుందని జగన్ న్యాయవాదులు పేర్కొన్నారు. త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని హైకోర్టు సీబీఐని కోరినందున ఈ దశలో జగన్‌కు మినహాయింపు ఇవ్వడం సరికాదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ కోర్టులో మొత్తం 11 కేసుల విచారణ కొనసాగుతోందని తన బదులు న్యాయవాది అశోక్‌రెడ్డి హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని జగన్ కోరారు. వ్యక్తిగత హాజరు తప్పనిసరని కోర్టు ఆదేశించినపుడు హాజరుకు సిద్ధమని చెప్పినా, కింది కోర్టు తమ భావనలను పరిగణనలోకి తీసుకోలేదని దాంతో వ్యక్తిగత కోర్టు హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఆశ్రయించామని చెప్పారు.