క్రైమ్/లీగల్

ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, ఫిబ్రవరి 12: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడంటూ యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జిల్లేడు చౌదరిగూడ ఎస్‌ఐ సయ్యద్ సరుూద్ కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి మండల పరిధిలోని వనంపల్లి గ్రామానికి చెందిన రేణుక (20), ప్రేమించిన వ్యక్తి మహేష్ మోసం చేశాడంటూ తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. బుధవారం సాయంత్రం మృతదేహంతో కుటుంబ సభ్యులు ప్రియుడు మహేష్ ఇంటి వద్ద ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సయ్యద్ సరుూద్, కొందుర్గు ఎస్‌ఐ శ్రీనివాస్‌లు ఘటన స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబ సభ్యులకు ఎంత నచ్చజెప్పిన వినకుండా ధర్నా నిర్వహించారు. మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మృతురాలి తల్లి రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.