క్రైమ్/లీగల్

పిల్లల సంరక్షణే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: వైవాహిక జీవితానికి తెర పడినంత మాత్రాన తల్లిదండ్రుల బాధ్యత కూడా ముగిసినట్లు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భార్య భర్తలు విడాకులు తీసుకున్నా తల్లిదండ్రులుగా వారు తమ బాధ్యతను నెరవేర్చాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లెప్పుడూ నష్టపోయేదీ చిన్నారులేనని, వీరి సంరక్షణకు సంబంధించి తల్లిదండ్రుల మధ్య జరిగే పోరాటంలో భార్య మూల్యాన్ని చెల్లించుకునేది కూడా అభం శుభం తెలియని ఈ పసి పిల్లలేనని సుప్రీం కోర్టు తెలిపింది. ఇలాంటి కేసుల్లో నిర్ణయాలు తీసుకునేప్పుడు సంబంధిత చిన్నారుల సంక్షేమ కోణానికి పెద్ద పీట వేయాలని న్యాయ స్థానాలకు సుప్రీం కోర్టు హితవు పలికింది. బాలుడైనా, బాలికైనా వారికి తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ ఎంతో ముఖ్యం కాబట్టి ఈ విషయంలో పిల్లల హక్కులను పూర్తి స్థాయిలో పరిరక్షించాలని న్యాయమూర్తులు ఏఎం ఖన్విల్కర్, అజయ్ రస్తోగిలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తన రూలింగ్‌లో వెల్లడించింది. మధ్యవర్తిత్వం ద్వారా వైవాహిక వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలు విఫలమైతే న్యాయ స్థానాలు సాధ్యమైనంత త్వరగా వీటిని పరిష్కరించే చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ వివాదాల పరిష్కారంలో ఎంతగా జాప్యం జరిగితే అంతగానూ నష్టపోయేదీ అన్ని విధాలుగా మూల్యం చెల్లించుకునేది పసి పిల్లలేనని కోర్టు పేర్కొంది. దీర్ఘకాలంగా వైవాహక వివాదంలో చిక్కుకున్న ఓ జంట కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లల సంరక్షణకు సంబంధించి అంతిమంగా విడాకులు తీసుకున్న భార్య భర్తల్లో ఎవరికి హక్కు లభిస్తుందన్న వ్యాఖ్య ఎలా ఉన్నా, అలాగే వీరిలో ఎవరు నెగ్గినా ఈ వివాదం సాగినంత కాలం అన్ని విధాలుగా నష్టపోయేది పిల్లలేనని కోర్టు తెలిపింది. పిల్లల సంరక్షణ, అలాగే వారి సంక్షేమం అత్యంత కీలకం అయినప్పుడు ఇతర సాంకేతికపరమైన అంశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. పిల్లల సంరక్షణ అంశాన్ని నిర్ణయించేప్పుడు కేవలం తల్లి లేదా తండ్రి అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని, ఇలాంటి కేసుల్లో న్యాయ స్థానాలే సముచితమైన నిర్ణయాలను తీసుకోవాలని సుప్రీం కోర్టు తెలిపింది.