క్రైమ్/లీగల్

ఇంటి దొంగే..బస్సు దొంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఫిబ్రవరి 18: ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన బస్సును చోరీ చేసి ఉడాయించిన దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీ డిపోలో క్యాజువల్ ఉద్యోగిగా (బస్‌ల వాషింగ్ సెంటర్)లో పని చేస్తున్న అంజనేయులు రెండు రోజుల క్రితం తాండూరు కరన్‌కోట్ మీదుగా ఓగీపూర్ వెళ్లేందుకు పాయింట్‌పై ఉన్న నైట్ హాల్ట్ బస్సును తాగిన మైకంలో తస్కరించాడని పట్టణ సీఐ ఎస్.రవికుమార్, ఎస్సై ఏడుకొండలు తెలిపారు. జీతం డబ్బులు చాలక జల్సాలకు అలవాటు పడి, తాగుడుకు బానిసైనట్లు నిందితుడు తెలిపాడు. బస్సును దొంగిలించి టైర్లు, విలువైన విడి భాగాలు అమ్ముకోవాలని భావించినట్లు వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.