క్రైమ్/లీగల్

యువతిని వేధించిన యువకుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, ఫిబ్రవరి 18: తణుకు నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న యువతిని వేధిస్తున్న యువకుడిని హనుమాన్‌జంక్షన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సంఘటన జరిగిన ఏరియా తమ పరిధిలోనిది కాకపోయినా హనుమాన్‌జంక్షన్ పోలీసులు తొలిసారిగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని నూజివీడు కోర్టుకు తరలించారు. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో జరిగిన సంఘటనకు సంబంధించి నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఓ యువతి తణుకు నుంచి హైదరాబాద్ వెళుతున్న బీఎస్‌ఆర్ ట్రావెల్స్ బస్సు నారాయణపురం వద్ద ఎక్కింది. అదే స్టేజిలో దర్బార్ అతని కుమారుడు (మైనర్) బస్సు ఎక్కారు. స్టేజి దాటిన కొద్దిసేపటి తర్వాత దర్బార్ కుమారుడు యువతిని వేధించడం ప్రారంభించాడు. యువతి రెండుసార్లు యువకుడ్ని హెచ్చరించిన ఎటువంటి మార్పు రాకపోవడంతో కలపర్రు టోల్‌గేట్ వద్ద బస్సు క్లీనర్‌కు విషయాన్ని వివరించింది. దీంతో క్లీనర్ యువకుడ్ని మందలించడంతో పాటు పద్ధతి మార్చుకోకపోతే బస్సు దిగిపోవాల్సి వుంటుందని హెచ్చరించారు. అదే సమయంలో దర్బార్ జోక్యం చేసుకుని క్లీనర్‌పై కుమారుడితో కలిసి దాడికి పాల్పడ్డాడు. బస్సు హనుమాన్‌జంక్షన్ కూడలి వద్దకు రాగానే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నైట్ డ్యూటీ సిబ్బంది సమాచారం మేరకు హనుమాన్‌జంక్షన్ సీఐ డివి రమణ, ఎస్‌ఐలు ఆశోక్‌కుమార్, ఉషారాణి, ఎస్‌కె బాషాలు బస్సు వద్దకు చేరుకుని యువకుడ్ని, తండ్రి దర్బార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. యువతి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఇద్దర్ని అరెస్టు చేశారు. ఇరువురిపై వేధింపుల కేసు, క్లీనర్ నరేష్‌పై దాడి చేసినందుకు మరో కేసు నమోదు చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నూజివీడు కోర్టుకు తరలించిన అనంతరం కేసును పెదపాడు పోలీసులకు బదిలీ చేస్తామని ఆయన ప్రకటించారు. మహిళలకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జీరో ఎఫ్‌ఐఆర్‌ను ప్రవేశపెట్టడంతో జంక్షన్ స్టేషన్‌లో తొలిసారిగా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని అయన వివరించారు. బాధితులు ఎవరైనా పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లోనైన ఫిర్యాదు చేయవచ్చునని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో జంక్షన్ సీఐ రమణ, ఎస్‌ఐలు ఆశోక్‌కుమార్, ఉషారాణి, ఎస్‌కె బాషా తదితరులు పాల్గొన్నారు.