క్రైమ్/లీగల్

వీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం కార్యాలయంపై ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: అమరావతి రాజధాని కేంద్రంగా భాసిల్లుతున్న నగరంలో ఇళ్ల స్థలాల రేట్లకు రెక్కలు రావటంతో భవన నిర్మాణాలు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగానికి కనకవర్షం కురిపించడం ప్రారంభమైంది. ప్రధాన రహదారుల వెంట గజం స్థలం ధర లక్ష రూపాయలుపైగా పలుకుతున్న నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ గజం స్థలంను వదలుకోటానికి సిద్ధపడటం లేదు. దీంతో నిబంధనలను, అధికారిక ప్లాన్‌లను పక్కన పెట్టి దాదాపు ప్రతి ఒక్కరూ అడ్డగోలుగా నిర్మాణాలు, ఫ్లోర్‌లపై ఫ్లోర్‌లు నిర్మించుకోవటం ప్రారంభించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అన్ని స్థాయిల్లోని వారు అక్రమ నిర్మాణదారులను భయపెట్టి దండుకోవటం ప్రారంభించారనే అభియోగాలు స్పందనలో వెల్లువెత్తటం అటుంచి ఏకంగా మున్సిపల్ మంత్రి బొత్స, అలాగే సీఎం జగన్ కార్యాలయానికి ఒక్క నగరం నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి ఇటీవల కాలంలో ఫిర్యాదులు వెల్లువెత్తసాగాయి. గవర్నర్‌పేట, గాంధీనగర్, సత్యనారాయణపురం, పటమట, పాతబస్తీ వంటి ప్రాంతాల్లో పురాతన భవనాలను కూలదోసి ప్లాన్‌లకు భిన్నంగా కట్టడాలు జరుగుతుంటే సింగ్‌నగర్, పాయకాపురం, మధురానగర్ వంటి ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఆఘమేఘాలపై బహుళంతస్తుల కట్టడాలు వెలుస్తున్నాయి. వీటన్నింటిపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ ఉన్నతాధికారి పీఎస్సార్ ఆంజనేయులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేశ్వరరావు నేతృత్వంలో ఓ బృందం మంగళవారం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో మెరుపుదాడులు నిర్వహించారు. అయితే ఆ సమయంలో కీలక వ్యక్తులు లేకపోవటంతో కీలక రికార్డులను స్వాధీనపరచుకుని తమకు వచ్చాన ఫిర్యాదులు ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించారు. మున్ముందు పలు ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణాలను కూడా ప్రత్యక్షంగా పరిశీలిస్తామని ఓ అధికారి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు నేతృత్వంలో అతి కొద్దికాలంలోనే ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ప్రైవేట్ ట్రావెల్స్‌పై పలుమార్లు దాడులు జరిగిన విషయం విదితమే.