క్రైమ్/లీగల్

కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 19: మద్యం మత్తులో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. పార్కు చేసిన బైక్‌ను ఢీ కొట్టగా దానిపై కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయాడు. మరోకారు, బైక్ ధ్వంసమయ్యాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బీహెచ్‌ఈఎల్ ఎంఐజీలో నివసిస్తున్న ఎండీ అఫ్సర్ (40) సంగారెడ్డి జిల్లాలోని కందిలో గల ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. కాగా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హఫీజ్‌పేట ఫ్లైఓవర్ సమీపంలోని ఎస్‌ఎస్ గ్రాండ్ హోటల్ వద్ద బిర్యానీ పార్సిల్ కోసం ఆగాడు. తన పల్సర్ బైక్ పై కూర్చుని సిగరెట్ తాగుతుండగా ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన హ్యూండాయ్ వెర్నా కారు ఢీ కొట్టింది. బైక్‌పై కూర్చోని ఉన్న ఎండీ అఫ్సర్ అక్కడికక్కడే మృతి చెందగా, దాంతో పాటు మరో బైక్, కారు ధ్వంసమయ్యాయి. బీరంగూడకు చెందిన కారు డ్రైవర్ సతీష్ మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మియాపూర్ ఇన్‌స్పెక్టర్ శామల వెంకటేష్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సీహెచ్ రఘురామ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.