క్రైమ్/లీగల్

రోడ్లపై డబ్బులు వేసి..చోరీ ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 9లక్షల 40వేల నగదు, నాలుగు బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన అకుల కిరణ్, గోగుల తులసింధర్‌లపై తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కేసులు ఉన్నాయి. కేవలం తమిళనాడ, కర్నాటక రాష్ట్రాల్లో గతంలోనూ 23 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. వీరిద్దరినీ విచారించగా మరో ఎనిమిది కొత్త కేసులు బయటకు వచ్చాయని, అలాగే, ఏపీ, తెలంగాణ, కర్నాటకలో చోరీలకు పాల్పడిన ఈ ముఠా సభ్యులు రోడ్డుపై కరెన్సీ పడేయడం, వాహనాలను పంక్చర్ చేసి ఆపై చోరీలకు పాల్పడటంలో వీరిద్దరూ దిట్ట. గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వీరిద్దరూ ఆ తర్వాత కూడా చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. నగరంలో మరోసారి చోరీకి పాల్పడుతుండగా సీసీ కెమెరాల్లో రికార్డయిందని, ఆ ఫుటేజీ ఆధారంగానే నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.