క్రైమ్/లీగల్

బకెట్లో పడి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుభీర్, ఫిబ్రవరి 23: ప్రమాదవశాత్తు బకెట్లో ఉన్న నీటిలో పడి ఒక బాలుడు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. కుభీర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో ఆదివారం మూడు గంటల ప్రాంతంలో బకెట్లో పడి ఆదిత్య (2) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం యోగేష్, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన ఆదిత్య వంటరూం పక్కనే ఉన్న బాత్ రూం వద్ద నీటితో నిండి ఉన్న బకెట్ వద్ద ఆడుకుంటున్నాడు. కుటుంబ సభ్యులు లోపల ఇంట్లో ఉండగా ఆదిత్య వద్ద ఉన్న రెండు రూపాయల నాణెం నీటిలోకి జారిపడింది. నాణెం తీసే ప్రయత్నంలో తలకిందులుగా బకెట్లో పడ్డాడు.
దీంతో ఊపిరి ఆడలేదు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భైంసా ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ జరిగిన సంఘటనకు గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆర్తనాదాలు మిన్నంటాయి.