క్రైమ్/లీగల్

క్షణికావేశంలో కన్నకొడుకును చంపిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 23: క్షణికావేశంలో ఓ తండ్రి కన్నకుమారుడినే హత్య చేసిన సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈమేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని పెదఖర్జ పంచాయతీ బొద్దిడి గ్రామానికి చెందిన అడ్డాకుల కాంతారావు తన కోడి పుంజును చెరువులో స్నానం చేయించి నీరు తాగిస్తుండగా కోడిపుంజు చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు మజ్జేశ్వరరావు(22) కోడి పుంజును ఎందుకు చెరువు దగ్గరకు తీసుకువెళ్లావని తండ్రిని నిలదీయడంతో ఇద్దరిమధ్య స్వల్ప వాగ్వివాదం జరగడంతో కోపోద్రిక్తుడైన కాంతారావు పక్కనే ఉన్న కత్తితో కుమారుడు గుండెపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న మజ్జేశ్వరరావును కుటుంబ సభ్యులు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడని తల్లి నిర్మల తెలిపారు. సమాచారం తెలిసి ఎల్విన్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.