క్రైమ్/లీగల్

ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: జార్ఖండ్‌లో ఆకలిచావు, దేశ వ్యాప్తంగా ఏకపక్షంగా మూడు కోట్ల రేషన్‌కార్డుల రద్దు చేశారన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. దీనిని రుజువు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఆకలిచావు, మూడు కోట్ల రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది. ‘నిరాధారమైన ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేయమనండి.. ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణలు మాత్రమే.. ఈ గణాంకాలు పూర్తి సత్యదూరమని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌ల ధర్మాసనానికి స్పష్టం చేశారు. ఆధార్ కార్డుతో లింక్ చేయలేదన్న కారణంతో దేశవ్యాప్తంగా మూడు కోట్ల రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందనీ.. ఈ కారణంగా జార్ఖండ్ రాష్ట్రంలో 13 సంవత్సరాల బాలిక ఆకలితో అలమటిస్తూ మరణిచిందంటూ సీనియర్ న్యాయవాది కొలిన్ గాన్‌సాల్వస్ పిల్ దాఖలు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ హాజరై ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. రేషన్‌కార్డుల అంశంపై గత సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తేదీన అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనీ.. చాలా రాష్ట్రాలు ఇంతవరకు స్పందించలేదని కోర్టుకు తెలియజేశారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ నాలుగు వారాల్లో ఈ అంశంపై విచారిస్తామని.. ఈలోపుగా అన్ని రాష్ట్రాలు ‘ఆహార భద్రతా చట్టం’ నేపథ్యంలో అందరికీ ఆహారం అందించాలన్న సంగతిని గుర్తెరిగి ఈ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారో తెలియజేయాలని ఆదేశించింది.