క్రైమ్/లీగల్

తిరుమలలో ఐదుగురు దళారుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: పలువురు ప్రజా ప్రతినిధులు, బోర్డు మెంబర్ల సిఫార్సు ఉత్తరాలతో అక్రమంగా వీఐపీల టికెట్లను పొంది బ్లాక్‌లో విక్రయించి భక్తులను మోసం చేసిన ఐదుగురు దళారులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీ ఐ జగన్మోహన్ రెడ్డి, టు టౌన్ సీ ఐ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం తిరుమలలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో కొంత మంది శ్రీవారి దర్శన టికెట్లు, లడ్డూలను బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. వారు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వారమని చెప్పుకుంటూ వారి సిఫార్సు ఉత్తరాలతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే 300 మంది దళారులను అరెస్టు చేశామన్నారు. ఈనేపథ్యంలో ఈనెల 6వ తేదీన ముగ్గురు భక్తుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 3,500 తీసుకుని వీ ఐపి టికెట్లు విక్రయించినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం నుంచి ఫిర్యాదు అందిందన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా తిరుపతి గ్రాండ్ వరల్డ్ సమీపంలోని ఉపాధ్యాయ నగర్‌లో ఉంటున్న ప్రొద్దుటూరుకి చెందిన జి.రవికిషోర్ రెడ్డి అలియాస్ రవి (35) బ్లాక్‌లో టికెట్లు అమ్మినట్లు ఫిర్యాదు రావడంతో అతనిని అరెస్టు చేశామన్నారు. అయితే రవి మహారాష్టక్రు చెందిన ఒక బోర్డు మెంబర్ వద్ద పిఏగా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడన్నారు. రవిని విచారించే సమయంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయన్నారు. శివకుమార్ అనే బోర్డు మెంబర్ వద్ద పిఏగా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న జనార్దన్ తిరుమలలోని స్వర్ణ గెస్ట్‌హౌస్‌లో పర్యవేక్షకునిగాపని చేస్తున్నాడన్నారు. అలాగే తిరుపతి మధురానగర్‌కు చెందిన పోలీ జగదీశ్వర్ రెడ్డి (29), తిరుపతిలో ఫైనాన్స్ వ్యాపారం చేసే దామోదరం (46), రాజేంద్ర ప్రసాద్ గెస్ట్‌హౌస్‌లో కేర్ టేకర్‌గా ఉన్న బండా దామోదరం (44)లను అరెస్టు చేశామన్నారు.