క్రైమ్/లీగల్

భారీగా బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఫిబ్రవరి 25: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ పోలీసులు పట్టుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ టోల్‌ప్లాజా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం జడ్చర్ల వైపు నుండి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సును హైదరాబాద్ జోనల్ యూనిట్ స్పెషల్ అధికారులు (డీఆర్‌ఐ) తనిఖీలు నిర్వహించి 3099గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.38కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారంతో ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రైవేట్ బస్సుకు ఎస్కార్ట్‌గా వస్తున్న మరో వాహనంలో ముగ్గురు స్మగ్లర్లు పరారయ్యారు. ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది.. ఎక్కడికి తీసుకువెళ్తున్నారనే విషయంపై డీఆర్‌ఐ అధికారులు విచారణ చేపట్టారు. ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ టోల్‌ప్లాజా వద్ద పెద్ద మొత్తంలో బంగారం లభించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అక్రమంగా బంగారం తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రాయికల్ టోల్‌ప్లాజా వద్దకు చేరుకొని వాహనాలను తనిఖీలు చేశారు. డీఆర్‌ఐ అధికారులు పక్కాగా స్కెజ్ వేసి బంగారం పట్టుకున్న వెంటనే అక్కడే ఉన్న కొంతమంది స్మగ్లర్లు వాహనంలో పరారైనట్లు పోలీసులు తెలిపారు. వారిని వెంబడించిన ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వివరించారు. బంగారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.