క్రైమ్/లీగల్

ఒకరి మృతికి కారకుడైన టిప్పర్ డ్రైవర్‌కు జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 25: ఒకరి మృతికి కారకుడైన టిప్పర్ డ్రైవర్‌కు ఏడాది జైలుశిక్ష, 2వేల రూపాయల జరిమానా విధిస్తూ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. అయోధ్యానగర్‌కు చెందిన పబ్బిశెట్టి విజయలక్ష్మి తన స్నేహితురాలు తంగెళ్ల మాధవితో కలిసి 2015 జూన్ 10న హోండా యాక్టివాపై వెళుతుండగా ప్రకాశం బ్యారేజీ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు వచ్చేసరికి వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిపోయిన మాధవిపై నుంచి టిప్పర్ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విజయలక్ష్మికి గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు నిందితుడైన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం మల్లపల్లి గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ గుమ్మడి నాగరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరపున పోలీసులు ప్రవేశపెట్టిన ఆరుగురు సాక్షులను విచారించారు. నిందితునిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు.