క్రైమ్/లీగల్

పోలీస్ వాహనం ఢీ: దంపతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి, ఫిబ్రవరి 25: పోలీస్ వాహనం ఇన్నోవా ఢీకొని బైక్‌పై వెళ్తున్న దంపతులు మృతిచెందగా, వారి కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిరుమలయపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన బొమ్మకంటి రాజు (45), రాణి (43) దంపతులు, వారి కూతురు కవిత కలిసి ఓ వివాహానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. పాలకుర్తి సీఐ బానోతు రమేష్ పోలీస్ వాహనంపై పాలకుర్తి నుండి తిరుమలాయపల్లి మీదుగా వర్ధన్నపేట వైపు వెళ్తూ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న రాజు, రాణికి తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతిచెందగా వారి కుమార్తె కవిత పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, రాజు, రాణి మృతిచెందగా కవిత పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఏసీపీ గొల్ల రమేష్ సందర్శించి జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు.

*చిత్రం... బైక్‌ను పోలీసు వాహనం ఢీకొన్న దృశ్యం