క్రైమ్/లీగల్

రోడ్లపై నిరసన తెలపొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఉంది, అయితే రహదారులను దిగ్బంధించకూడదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. షాహీన్‌బాగ్ కేసులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. షాహీన్‌బాగ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు ఇద్దరు న్యాయవాదులను మధ్యవర్తులుగా కోర్టు నియమించింది. ‘ షాహీన్‌బాగ్ ఘటనకు సంబంధించి ఇంతకు ముందు వాయిదాలో మా అభిప్రాయం చెప్పాం. నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉంది. అదే మాట అప్పుడూ చెబుతున్నాం..ఇప్పుడూ చెబుతున్నాం. అయితే రహదారులను దిగ్బంధించకూడదు’అని బెంచ్ స్పష్టం చేసింది. బీజేపీ నేత నంద కిశోర్ గర్గ్ తరఫున న్యాయవాది శశాంక్ డియో సుధి చేసిన వ్యాఖ్యలపై బెంచ్ స్పందించింది. నిరసనకారులను ఖాళీ చేయించేలా తాత్కాలిక ఆదేశాలివ్వాలన్న సుధి అభ్యర్థనపై న్యాయమూర్తులు మాట్లాడుతూ ‘ నిరసన అన్నది ఓ ఆయుధం. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంది. అలాగని మిగిలిన వారికి ఇబ్బంది కలిగించేలా నిరసనలు ఉండకూడదు’అని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం కోర్టు నియమించిన మధ్యవర్తులు చేస్తున్న ప్రయత్నాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యవర్తుల కృషిని బెంచ్ ప్రశంసించింది. కోర్టు వెలుపల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నామని, అది ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలని అన్నారు. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, న్యాయవాది సాధనా రామచంద్రన్‌ను కోర్టు మధ్యవర్తులుగా నియమించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించారు. నిరసకారులు రోడ్డు ఖాళీ చేసేలా ఒప్పించాలని మధ్యవర్తులను కోరారు. దీనిపై కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని బెంచ్ పేర్కొంది. నిరసకారులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మధ్యవర్తులకుందని, ఈవిషయంలో వారి కృషి బాగుందని కోర్టు పేర్కొంది. నిరసల తెలపడానికి రహదారులు వేదిక కాకూడదని వారికి నచ్చజెబుతారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరూ నిగ్రహం పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.