క్రైమ్/లీగల్

చెట్లు నరికివేత : రూ. 30 వేలు జరిమానా:

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 26: ఇంటి నిర్మాణం కోసం చెట్లు అడ్డు వస్తున్నాయని చెట్లు నరికివేయగా, 30 వేల రూపాయలు జరిమానా విధించిన వైనం గోధుమకుంట గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గోధుమకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని టీపీఎస్ కాలనీలో గతంలో హరితహారం కింద మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవిగా ఎదిగాయి. కాలనీకి చెందిన కృష్ణ, రమాకాంత్‌లు తమ ప్లాట్లలో ఇళ్లు నిర్మించు కునేందుకు పాట్లకు అడ్డు వస్తున్నాయని, గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎనిమిది చెట్లను నరికి వేసారు. కాలనీ వాసులు సర్పంచ్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయటంతో అక్కడికి చేరుకొని జరిమానా విధించి, నగదు వసూలు చేసారు. హరితహారం మొక్కలు నరికితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీవో మంగతాయారు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసు, ఆంజనేయులు పాల్గొన్నారు.