క్రైమ్/లీగల్

ఐడీఎల్‌లో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, ఫిబ్రవరి 26: కూకట్‌పల్లిలోని ఐడీఎల్ ( ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్ ) గల్ఫ్ అయిల్ కార్పొరేషన్ కంపెనీలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు డిటోనేటర్ పేలి భారీ పేలుడు సంబంవించింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరి కొంత మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో కంపెనీలో బ్లాక్ నంబర్ 46సిలో పెద్ద ఎత్తున్న శబ్ధాలతో ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సంఘటన ప్రాంతానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఏలేశ్వర వాసుదేవ శర్మ (62) తీవ్రగాయాలకు గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరోకరు మియాపూర్ పీజే ఆర్‌నగర్‌కు చెందిన గోరింకల పద్మారావు (60)కు తీవ్రగాయాలయ్యాయి. ఎం.హరికాంత్,నవీన్‌కుమార్‌లను ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కంపెనీనీ ఈ ప్రాంతం నుంచి తరలించాలని పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నప్పటీకి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.