క్రైమ్/లీగల్

రౌడీషీటర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, ఫిబ్రవరి 26 : సిరిసిల్ల జిల్లా వేములవాడలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో రౌడీషీటర్‌ను కత్తులతో పొడిచి పట్టపగలు దారుణంగా హత్య చేశారు. ఉదయం 9 గంటల సమయంలో యువకునిపై మాజీ కౌన్సిలర్ కత్తులతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వేములవాడలోని 17వ వార్డుకు చెందిన రౌడీషీటర్ నూగూరి శివ ద్విచక్రవాహనంపై వస్తుండగా అదే వార్డులోని మాజీ కౌన్సిలర్ ముద్రకోళ వెంకటేశం తన అనుచరులతో కాపుకాసి ఉదయానే్న అతడిని కత్తులతో పొడిచి పరారయ్యారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న శివను హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఎన్నికల గొడవల వల్లే..
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎలక్షన్‌లో నూగూరి శివ 17వ వార్డులో పోటీచేసిన వెంకటేశం భార్యకు మద్దతు తెలపకుండా తన ప్రత్యర్థికి మద్దతు తెలిపాడు. తన భార్య తమ ఓటమికి కారణమయ్యాడన్న కక్షతోనే చిన్న చిన్న గొడవలు సృష్టిస్తూ శివతో వెంకటేశం వాగ్వాదానికి దిగి బుధవారం దాడి చేసి హతమార్చారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్యకు పాల్పడిన వెంకటేశంపై ఎన్నికలకు ముందు పలు కేసులు ఉండి, అతనిపై రౌడీషీట్ కూడా ఉండగా భార్యను బరిలో దింపాడు. అయతే అతని భార్య ఓటమిపాలు కావడంతో అప్పటి నుండి తనకు మద్దతు తెలపని వారితో వివాదాలకు పాల్పడుతున్నాడు. బుధవారం రోడ్డుపై ఉదయానే్న కత్తితో శివను హత్య చేసిన తర్వాత కత్తిని తిప్పుతూ సమీప ప్రజలను భయభ్రాంతులకు గురిచేసాడని, తనకు మద్దతు తెలపని చాలామందిని బెదిరించాడని స్థానికులు తెలిపారు. ఉదయం నడిరోడ్డులో జరిగిన హత్య ఉదంతాన్ని చూసిన గృహిణులు భయాందోళనకు గురయ్యారు. హత్య చేసిన వెంకటేశం తన అనుచరులతో స్థానిక పోలీస్‌స్టేషన్లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రకాంత్, సీఐ శ్రీ్ధర్, చేరుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.
*చిత్రం... * హత్యకు గురైన శివ ఫైల్ ఫొటో
*మాజీ కౌన్సిలర్ ఎం వెంకటేశం చేతిలో హత్యకు గురైన నూగూరి శివ