క్రైమ్/లీగల్

పల్లెపాలెంలో వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, మార్చి 1: మండల పరిధిలోని గుడిదిబ్బ పల్లెపాలెంలో ఓ వ్యక్తి దారణ హత్యకు గురైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అండ్రాజు వెంకటేశ్వరరావు(46) అదే గ్రామానికి చెందిన బొడ్డు సుశీలతో వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు. శనివారం సాయంత్రం 9గంటలకు సుశీల ఇంటికి వెళ్లి వెంకటేశ్వరరావు వెళ్లి బలత్కరించగా సుశీల కుమారులు ఇద్దరూ సమీపంలో ఉన్న కరకట్ట వద్దకు తీసుకువెళ్లి తలపై తాటిపట్టెతో కొట్టి శరీరం అంతా గాయాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు శనివారం అర్ధరాత్రి గాయాలపాలైన వెంకటేశ్వరరావును భీమవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళదామనుకున్న సమయంలో ఆర్‌ఎంపీ వైద్యుడిని తీసుకు రాగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపాడు. సుశీల కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ కృత్తివెన్ను పోలీసులకు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వెంటనే సుశీల కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మేమే చంపామని తెలిపారు. దీంతో ఆదివారం ఉదయం సంఘటన స్థలానికి బందరు డీఎస్పీ మెహబూబ్ భాషా, సీఐ కొండయ్య, ఎస్‌ఐలు రవిచంద్రకుమార్, తులసీ రామకృష్ణ చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం వల్లనే వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు.