క్రైమ్/లీగల్

ఫ్లై ఓవర్ పై నుంచి దూకి డ్రైవర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, మార్చి 2: కుటుంబ కలహాలతో కారు డ్రైవర్ ప్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లోయపల్లి గ్రామానికి చెందిన పోలగోని నరేందర్ (37) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి భార్య పార్వతమ్మ, కుమారుడు శ్రీకర్‌లతో కలసి బీఎన్‌రెడ్డి నగర్, సాగర్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు.సోమవారం తెల్లవారు జామున తన ఇంటి నుంచి (ఏపీ11జే 5283) నెంబర్ గల ద్విచక్ర వాహనం పై వచ్చి ఎల్బీనగర్ రింగ్ రోడ్డులోని ప్లై ఒవర్‌పై వాహనాన్ని పార్కింగ్ చేసి ప్లై ఓవర్ పై నుంచి నాగోలు వెళ్ల్లే రహదారి పై దూకాడు. తీవ్రంగా గాయపడ్డ నరేందర్‌ను 108 వాహనంలో ప్రక్కనే ఉన్న ఆరేంజ్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు మృత దేహాన్ని పరిశీలిస్తుండగా జేబులో సూసైడ్ నోట్ లభించింది.తన చావుకు కుటుంబ కలహాలే కారణమని అందులో రాసిపెట్టాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ అశోక్ రెడ్డి చెప్పారు.