క్రైమ్/లీగల్

జీవోలు వెబ్‌పోర్టల్‌లో పెట్టాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెబ్ పోర్టల్‌లో ఎందుకు ఉంచడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై రెండు వారాల్లోగా ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని లేకుంటే ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. పిటిషన్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖరరావు దాఖలు చేశారు. పిటిషన్‌పై గత ఆరు నెలల నుండి విచారణ జరుగుతున్నా, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం లేదని శేఖరరావు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా శేఖరరావు మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరేళ్ల నుండి వేలాది ప్రభుత్వ జీవోలను చట్టప్రకారం వెబ్ సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సమాచార హక్కు చట్టం నిబంధనలను అతిక్రమిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఏమైనా తప్పుడు నిర్ణయాలు ఉన్నా, అవినీతికి అవకాశం కల్పించేలా ఏమైనా ఉత్తర్వులు ఉన్నా అవి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అందుకే ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు అన్నీ వెబ్ పోర్టల్‌లో ఉంచాలని అన్నారు. జీవోల వివరాలను తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు అని వాటిని గౌరవించాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అవినీతి, అక్రమ నిర్ణయాలు బయటపడతాయనే ఉద్దేశంతో ప్రజల ముందు ఉంచడం లేదని ఆయన పేర్కొన్నారు.