క్రైమ్/లీగల్

రూ. రెండు లక్షల లంచంతో ఏసీబీకి పట్టుపడ్డ న్యాయవాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 3: న్యాయం వైపు నిలబడి కక్షిదారులకు న్యాయ స్థానంలో న్యాయం జరిగేలా చూడాల్సిన ఓ న్యాయవాది లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో మహిళకు అడ్వకేట్ లీగల్ ఎయిడ్‌గా ఉండమని లీగల్ సర్వీసెస్ అథారిటీ నియమిస్తే దీన్ని ఆసరాగా తీసుకొని తాను కేసు విషయంలో సహకరించాలంటే రూ.పది లక్షలు లంచం ఇవ్వాలంటూ కోరాడు. చివరకు ఏమి చేయాలో తెలియని ఆ మహిళ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఈ క్రమంలో మంగళవారం అడ్వాన్స్ కింద రూ.రెండు లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆ న్యాయవాదిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నెల్లూరు ఏసీబీ డీఎస్‌బీ దేవానంద్ శాంతో తెలిపిన వివరాల మేరకు 2018లో చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు 8వ జిల్లా అదనపు కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి బాధితురాలు తనకు న్యాయవాదిని ఏర్పాటు చేయాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి విజ్ఞప్తి చేసింది. దీంతో లీగల్ సర్వీసెస్ అథారిటీ బాధిత మహిళకు అడ్వకేట్ లీగల్ ఎయిడ్‌గా న్యాయవాది సనాతన భరత్‌ను కేటాయించింది. అయితే ఆ న్యాయవాది భరత్ న్యాయస్థానంలో ట్రైల్‌లో ఉన్న కేసుకు సహకరించాలంటే తనకు రూ.పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ మహిళ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఏసీబీ అధికారుల సూచన మేరకు రూ. రెండు లక్షలు లంచాన్ని మంగళవారం స్థానిక శాంతినగర్‌లో ఉన్న న్యాయవాది భరత్ కార్యాలయంలో ఇస్తుండగా, అప్పటికే వల పన్నిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లంచం సొమ్ము తీసుకుంటున్న న్యాయవాది సనానత భరత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. న్యాయవాది భరత్ చేతులను రసాయినిక పరీక్షలు నిర్వహించగా లంచం తీసుకున్నట్లు నిర్ధారించుకున్న ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.