క్రైమ్/లీగల్

విద్వేష ప్రసంగాలపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: సీఏఏ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన సామాజిక కార్యకర్త హర్ష్ మణ్‌దీర్‌కు సుప్రీం కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆందోళనకారులను మండేర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్నది అభియోగం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని బీఆర్ గవాయి, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం కాలమిస్టు మండేర్‌ను వివరణ కోరింది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈసందర్భంగా న్యాయాధికారిని ఉద్దేశించి కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ కోర్టు గురించి మీరేమనుకుంటున్నారు? మీ వాదన విన్నాం(మణ్‌దీర్ లాయర్). వాళ్లపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివరణ కోరండి’ అని పేర్కొంది. తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ సామాజిక కార్యకర్త, రచయిత హర్ష్ మణ్‌దీర్ రెచ్చగొట్టే ప్రసంసగాలు చేయడమే కాదు, కోర్టును ఉద్దేశించి అభ్యంతరకరమైన ప్రకటనలు చేశారని ఆరోపించారు. చట్టాన్ని ధిక్కరించిన వారి వివరాలు తమకు కావాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మ, కపిల్ మిశ్రా, అభయ్ వర్మ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని సీనియర్ న్యాయవాది కొలిన్ గానె్సల్వేస్ కోర్టు దృష్టికి తెచ్చారు. భోజన విరామం తరువాత విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన రాజకీయ నాయకులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం విచారించింది. కేసులు హైకోర్టుకు అప్పగించారు. పిటిషన్లు ఈనెల 6న విచారణకు రానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసకు సంబంధించి 10 మంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. అల్లర్లకు సంబంధించిన పిటిషన్లను సాధ్యమైనంత త్వరగా విచారణకు చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీం ధర్మాసనం సూచించింది. ఢిల్లీ అల్లర్ల వివాదాలన్నింటికి హైకోర్టు శాంతియుత పరిష్కారం కనుగొంటుందని సుప్రీం స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్త మణ్‌దీర్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సొలిసిటర్ జనరల్ కేంద్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేశారు. అయిత సొలిసిటర్ జనరల్ ఆరోపణలు మణ్‌దీర్ తరఫున్యాయవాది కరుణ నంది ఖండించారు. తన క్లయింట్ కేంద్రంపై ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని కోర్టుకు తెలిపారు. మణ్‌దీర్ పార్లమెంట్, న్యాయస్థానాన్ని అవమానపరిచేలా ప్రకటనలు చేశారా? అని సీనియర్ న్యాయవాది కొలిన్ గానె్సల్వేస్‌ను కోర్టు అడిగింది. దీనిపై సొలిసిటర్ జనరల్ జోక్యం చేసుకుంటూ మణ్‌దీర్ అభ్యంతరకరమైన ప్రకటనలు చేశారని ఆరోపించారు. కాగా కరుణ నంది మాట్లాడుతూ హర్ష్ మణ్‌దీర్ పక్షాన తాను వాదిస్తానని చెప్పారు. అప్పటి వరకూ మణ్‌దీర్ తరఫున వాదించిన గానె్సల్వేస్ ఇక నుంచి తాను బాధితుల పక్షాన వాదిస్తానని కోర్టుకు తెలిపారు.