క్రైమ్/లీగల్

కాలువలోకి దూసుకుపోయిన కారు :ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున కారు కాలువలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం జిల్లాలోని యలమంచిలి మండలం కాజ తూర్పు గ్రామానికి చెందిన కొప్పినీడి సురేష్ (22), అతని బావమరిది, చౌదరి కాశీ (22), చింతా చిట్టియ్య (45) రొయ్య సీడ్ కొనుగోలు నిమిత్తం మంగళవారం కారులో తూర్పు గోదావరి జిల్లా అన్నవరం వెళ్ళారు. సీడ్ కొనుగోలు అనంతరం తిరిగివస్తుండగా, బుధవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు పోడూరు మండలం జగన్నాథపురం గ్రామం వద్ద నరసాపురం ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారు కాలువలో కారు తేలుతుండటాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. పోడూరు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని, అగ్నిమాపక సిబ్బంది సాయంతో కారును వెలికితీశారు. కారులో ఉన్న మూడు మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాలకొల్లు రూరల్ సీఐ జి వెంకటేశ్వరరావు, పోడూరు ఎస్సై సురేంద్రకుమార్, ఆచంట ఎస్సై సీహెచ్ రాజశేఖర్ సంఘటనాస్థలానికి చేరుకుని కారు వెలికితీత, మృతదేహాల తరలింపు తదితరాలను పర్యవేక్షించారు.