క్రైమ్/లీగల్

కరోనాపై హైకోర్టు మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున హోలీ సంబరాలను నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిద్ధలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన ప్రజావాజ్యపిటిషన్‌ను న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టాలని హైకోర్టు పేర్కొంది. వ్యాధి వ్యాపించడానికి ఉన్న అవకాశాలున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించింది. గురువారం నుండి హైకోర్టులోకి వచ్చే వారికి మాస్కులు తప్పనిసరి చేయాలని ఆదేశించింది. కోర్టు కార్యకలాపాలతో సంబంధం లేని వారిని న్యాయస్థానాల ప్రాంగణాలకు తీసుకురావద్దని న్యాయవాదులకు సూచించింది. విచారణ ఖైదీలను జైలు సిబ్బంది హాజరుపరచకపోతే గడువు ఇవ్వాలని , వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది. సభలు, సమావేశాల నిర్వహణపై పోలీసులు సమీక్షించాలని పేర్కొంది. కరోనాను ఎదదుర్కోనే ప్రణాళిక ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుముందుంచాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. హైకోర్టు సూచనలతో రిజిస్ట్రార్ జనరల్ ఎ వెంకటేశ్వరరెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. జైలులో ఉన్న నిందితులను కోర్టు ముందు హాజరుపరచకపోయినా తాత్కాలికంగా ఎలాంటి శిక్షలూ, కఠిన చర్యలూ తీసుకోవద్దని, కోర్టు ప్రాంగణాలకు వచ్చే వారి సంఖ్య తగ్గించాలని, కోర్టు ప్రాంగణాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. శానిటైజర్లు కోర్టు ప్రాంగణంలో అందుబాటులో ఉండేలా చూడాలని, నిత్యం చేతులు శుభ్రం చేసుకోవాలని, జిల్లా కోర్టు ప్రాంగణాల్లో కనీసం ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. హోమియో మందులను కూడా పంపిణీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.