క్రైమ్/లీగల్

మీ జోక్యం అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 5: సీఏఏ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులో ఢిల్లీ అల్లర్ల బాధితుడి జోక్యంను సుప్రీం కోర్టు తిరస్కరించింది. సామాజిక కార్యకర్త హర్ష్ మందర్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారని అభియోగం. మందర్ కేసులో బాధితుల తరఫున తన వాదనలు వినిపించడానికి అనుమతి ఇవ్వాలని సీనియర్ న్యాయవాది కొలిన్ గాన్‌సాల్వేస్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. విద్వేష ఉపన్యాసం కేసు శుక్రవారం విచారణకు రానుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే ‘ఈ కేసులో మీ జోక్యాన్ని అనుమతించబోం’అని వెల్లడించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళన సందర్భంగా రికార్డయిన వీడియోను తాను వీక్షించానని గాన్‌సాల్వేస్ కోర్టుకు తెలిపారు. దీనిపై సీజే మాట్లాడుతూ ‘ ఈ వీడియో మా ముందు ఉంచాలని సొలిసిటర్ జనరల్‌ను కోరాం. అయితే ఈ విషయంలో మీ వాదనలు వినాల్సిన అవసరం మాకు లేదు’అని స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్ల కేసులో హర్ష్ మందర్ తరఫున హైకోర్టులో తాను వాదించానని న్యాయవాది చెప్పగా ‘ఇక్కడ కూడా ఆయన తరఫున వాదనలు వినిపించవచ్చు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. సామాజిక కార్యకర్త మందర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ ఢిల్లీ పోలీసులు బుధవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పార్లమెంట్, సుప్రీం కోర్టు, న్యాయవాదులను కించపరిచేలా మందర్ మాట్లాడారని పోలీసులు ఆరోపించారు.