క్రైమ్/లీగల్

శబరిమల వాదనలు పూర్తయ్యాకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. గురువారం పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ‘శబరిమల కేసుల్లో వాదనలు పూర్తయిన తరువాతే సీఏఏ పిటిషన్లు విచారిస్తాం’ అని వెల్లడించింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై అత్యవసరంగా వాదనలు వినాలని కోరారు. దీనిపై కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం లేదని ఆయన ఆరోపించారు. త్వరలోనే దీనిపై సమాధానం ఇస్తామని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ధర్మాసనానికి వివరించారు. బాబ్డే సారధ్యంలో న్యాయమూర్తులు బీఆర్ గవాయి, సూర్యకాంత్ ధర్మాసనంలో ఉన్నారు. ఇలా ఉండగా శబరిమలలోని అయ్యప్ప ఆలయంతోపాటు వివిధ మతాలకు చెందిన అంశాలను తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం విచారించనుంది. శబరిమలతో పాటు మసీదుల్లోకి మహిళల ప్రవేశంపైనా కోర్టు వాదోపవాదాలు వినాల్సి ఉంది.