క్రైమ్/లీగల్
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రేణిగుంట, మార్చి 5: చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో సంచలనం సృష్టించిన బాలుడి అపహరణ సంఘటన సుఖాంతమైంది. జిల్లా పోలీసులు సవాల్‌గా తీసుకొని 24 గంటల్లో కేసును ఛేదించారు. అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఆ బాలుడ్ని తల్లికి అప్పగించారు. గురువారం అర్బన్ ఎస్పీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈఘటనలో కిడ్నాప్‌కు సంబంధించి ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశామన్నారు. ఈనెల 2వ తేదీ రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బాలుడి అపహరణకు కేసు పరిశోధనకు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి సిసి ఫుటేజీలు పరిశీలించి బాలుడిని అపహరించిన మహిళ కదలికలను కనిపెట్టి ఆమె వాడిన సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితురాలు అంబికాసోనీ పుత్తూరులో ఉన్నట్టు కనుగొని అక్కడ అరెస్టుచేశామన్నారు. పెళ్లయి 14ఏళ్లయినా సంతానం లేకపోవడంతో బిడ్డ అపహరణకు పథకం వేసిందని తమ విచారణలో వెల్లడైందన్నారు. ఈ ఘటనలో ఆమెకు సహకరించిన మరో నలుగుర్ని అరెస్టు చేశామన్నారు. కిడ్నాప్‌నకు గురైన బాలుడి తల్లి స్వర్ణలత మాట్లాడుతూ తన బిడ్డ దక్కినందుకు ఎంతో ఆనందం వ్యక్తం చేసింది పోలీసుల కృషిని కొనియాడింది.