క్రైమ్/లీగల్

దిశ హంతకుడు చెన్నకేశవులు తండ్రి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, మార్చి 9: పశువైద్యాధికారి దిశను అత్యంత దారుణంగా చంపిన వారిలో ఒకరైన 4వ ముద్దాయి గురుడిగండ్ల వాసి చింతకుంట చెన్నకేశవులు తండ్రి చింతకుంట కుర్మయ్య (48) ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నారాయణపేట జిల్లా మక్తల్ ఎస్సై అశోక్‌కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన దిశ నిందితుడు చింతకుంట చెన్నకేశవులు తండ్రి అయిన చింతకుంట కుర్మయ్య గత డిసెంబర్ 26న మండల పరిధిలోని జక్లేర్ గ్రామంలోని ఎన్‌హెచ్ 167పై మోటారు సైకిల్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా వెంటనే కుర్మయ్యను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించి అనంతరం మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ కొంత మేరకు చికిత్స అందించి అక్కడి నుండి స్వరాజ్ హాస్పిటల్‌కు తరలించి అక్కడే ఇంతవరకు చికిత్స నిర్వహించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఈనెల 5వ తేదీన డిశ్చార్జి అయ గుడిగండ్లకు వచ్చారు. గుడిగండ్లలో చికిత్స పొందుతూ సోమవారం 12గంటలకు మృతి చెందారు. కుర్మయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించనున్నట్లు ఎస్సై ఆశోక్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాగా చెన్నకేశవులు భార్య ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
*చిత్రం...మక్తల్ మండలం గుడిగండ్లలో చికిత్స పొందుతూ
మృతి చెందిన దిశ కేసు హంతకుడు చెన్నకేశవుల తండ్రి కుర్మయ్య