క్రైమ్/లీగల్

బంగారం స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 11: ఎటువంటి పత్రాలు లేకుండా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాసభ్యులను డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారి-16పై అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురిని డిఆర్‌ఐ అధికారులు బుధవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. వీరు కేరళ రాష్ట్రం కోయంబత్తూరు నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు ప్యాంటు బెల్టుపెట్టుకునే నడుం చుట్టూ ప్రత్యేకంగా తయారుచేసిన జిప్‌లోనూ, మరోవ్యక్తి తన బ్యాగులోనూ బంగారాన్ని దాచి రవాణా చేస్తుండడాన్ని అధికారులు గుర్తించారు. వీరి వద్ద నుండి రూ.2,33,73,747లు విలువచేసే అయిదున్నర కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.