క్రైమ్/లీగల్

మణప్పురం ఫైనాన్స్‌లో చోరీకి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 11: నాలుగు రోజుల క్రితం అద్దెకు దిగిన ముగ్గురు దుండగులు.. మణప్పురం ఫైనాన్స్‌లో చోరీ చేసేందుకు యత్నించిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు దుండగులు ఉప్పల్‌కు చెందిన నకిలీ ఆధార్ కార్డులతో కొంపల్లిలోని సన్న మల్లేశం కాంప్లెక్స్‌లోని ఓ షట్టర్‌లో అద్దెకు దిగారు. అదే కాంప్లెక్స్‌లో మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ ఉంది. దుండగుల వద్ద ఓ గ్యాస్ కట్టర్, రెండు గడ్డపారలు, మూడు చిన్న సిలిండర్ ఉన్నాయి. మంగళవారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో సీసీ కెమెరాలను కట్ చేశారు. సీసీ కెమెరాలు కట్‌చేసిన వెంటనే హెడ్ ఆఫీస్ అయిన కేరళలోని వలపాడులో అక్కడి సంస్థ నిర్వాహకులకు కొంపల్లిలోని మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయం పూర్తిగా చీకటైనట్లు తెలిసింది. కొంపల్లిలోని కార్యాలయ నిర్వాహకులకు వలపాడు అధికారులు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బందికి దుండగులు ఉన్నట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులను గమనించిన దుండగులు అక్కడి నుంచి ప్రక్కనే ఉన్న శ్మశాన వాటికలో వైపు వెళ్లి పరారయ్యారు. బాలానగర్ డీసీపీ పద్మజ, పేట్‌బషీరాబాద్ ఏసీపీ నర్సింహా రావు, సీఐ మహేలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సీసీఎస్ పోలీసులు నమూనాలను సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.