క్రైమ్/లీగల్

షోరూంలోని ద్విచక్ర వాహనం చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, మార్చి 2: షోరూంలోని ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. లంగర్‌హౌస్ ఎస్‌ఐ బాలస్వామి కథనం ప్రకారం.. లంగర్‌హౌస్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే 85 పిల్లర్ నెంబర్ వద్ద ద్విచక్ర వాహనాల షోరూం ఉంది. బుధవారం రాత్రి షోరూమ్‌కి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. గురువారం తెల్లవారు జామున సుమారు రెండు గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి లోనికివెళ్లి లక్ష రూపాయాల విలువైన కేటీఎం కవాసకీ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి పారిపోయారు. ఉదయం షారూం వద్దకి సిబ్బంది వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా ఓ వాహనం కనిపించలేదు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.