క్రైమ్/లీగల్

మంటలు అంటుకుని రైలు బోగీ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, మార్చి 14: రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న రైలు బోగీలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని బోగి దగ్ధమైన సంఘటన శనివారం మల్కాజిగిరి పరిధిలోని వౌలాలి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సికిందరాబాద్ నుంచి కాకినాడకు వెళ్లే రైలును మరమ్మతు నిమిత్తం శనివారం ఉదయం వౌలాలి రైల్వేస్టేషన్ నిలిపారు. ప్రమాదవశాత్తు వెనుక ఉన్న బోగీలో మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో 3 ఫైర్ ఇంజన్‌లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ప్రమాదంలో రైలు బోగి పాక్షికంగా దెబ్బతిన్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.