క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, మార్చి 14: రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందగా ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. మండల పరిధిలోని ఆత్కూరు శివార్లలో శనివారం ఈప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వెలగలేరు శివారు కొల్లేటిగూడెం గ్రామానికి చెందిన సరిపల్లి కుమారి (65), సుబ్బారావు (70) దంపతులు. వీరు జి.కొండూరు నుంచి వారి స్వగ్రామానికి టివీఎస్ మోపేడ్‌పై తిరిగి వెళ్తుండగా, ఆత్కూరు గ్రామపరిధిలోని పెట్రోలు బంకు వద్ద వెనుక నుంచి గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. ఈప్రమాదంలో కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త సుబ్బారావుకు కాలు విరిగిపోయి తీవ్రగాయాలయ్యాయి. సుబ్బారావును విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆపకుండా వెళ్ళిన డ్రైవర్ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుంటుబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబంతో చర్చలు జరిపారు. చట్టప్రకారం న్యాయం చేస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు.