క్రైమ్/లీగల్

తుపాకీతో కాల్చుకుని రిటైర్డ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 14: తుపాకీతో కాల్చుకుని రిటైర్డ్ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతి నగరంలో శనివారం చోటు చేసుకుంది. బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన సిద్ధ రాము స్థానిక సుందరయ్య నగర్‌లోని దోబీ ఘాట్ వద్ద ఓ సమాధిపై పడుకుని తన తుపాకీతో తలపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే మరణించాడు. తుపాకీ పేలిన శబ్ధం విన్న సమీపంలోని కొందరు రజకులు అక్కడకి చేరుకుని వెంటనే ఈస్ట్ పోలీసులకు సమాచారం అందించారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం గర్నిమిట్ట గ్రామం కొండారెడ్డి పల్లికి చెందిన సిద్ధరాము ప్రస్తుతం తిరుపతి సుందరయ్య నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.