క్రైమ్/లీగల్

మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, మార్చి 16: మెదక్ జిల్లా కొల్చారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ ఏడుపాయల దుర్గ్భావాని ఆలయం వద్ద ఓ విందుకు హాజరయ్యేందుకు వస్తున్న డీసీఎంను ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ సంఘటన కొల్చారం మండలం చిన్నఘణపురం సబ్‌స్టేషన్ సంగాయిపేట గ్రామల మధ్య సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పసల్‌వాడి గ్రామానికి చెందిన గొడుగు రాము లు ఏడుపాయల దుర్గ్భావాని ఆలయం వద్ద విందు
కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి రాత్రే కుటుంబీకులు ఒక డీసీఎంలో చేరుకున్నారు. ఉదయం 12 గంటలకు బంధువులు మరొక డీసీఎంలో సంగారెడ్డి నుండి జోగిపేట మీదుగా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామశివారు దాటి చిన్నఘణపురం సబ్‌స్టేషన్ శివారులో వెళ్తున్నారు. అదే సమయంలో మెదక్ నుండి పటాన్‌చెరు వెళ్తున్న సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు సబ్‌స్టేషన్ దాటి రాగానే ఆర్టీసీ డ్రైవర్ శంసీర్ అజాగ్రత్తగా బస్సును నడుపుతూ సెల్‌ఫోన్ చూస్తూ ఎదురుగా వస్తున్న డీసీఎంను బలంగా ఢీకొట్టాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడగా, డీసీఎంలో ఉన్న సంగారెడ్డి జిల్లా అంగడిపేటకు చెందిన చాపల మాధవి (40), బద్రిగూడెంకు చెందిన మనె్న మంజుల (40), గంజిగూడెంకు చెందిన నీరుడి దుర్గమ్మ (58), అదే గ్రామానికి చెందిన గుడాల మాణమ్మ (55), పసులాబాద్‌కు చెందిన గొడుగు రజిత (45) అక్కడిక్కడే మృతి చెందారు. దివ్వాల్ మాధురి (9) మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోపే కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను 108లో మెదక్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని వెంటనే పై అధికారులకు తెలపడంతో అడిషనల్ ఎస్పీ నాగరాజు, డీఎస్పీ కృష్ణమూర్తి, సీఐలు రాజశేఖర్, వెంకట్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులను వెంటనే మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రహదారి పూర్తిగా దిగ్బంధమైంది. ప్రమాదంతో రెండు గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

*చిత్రం... ప్రమాదంలో నుజ్జునుజ్జయిన డీసీఎం