క్రైమ్/లీగల్

నోటుకు ఓటు కేసులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో విచారణ మరోమారు వాయి దా పడింది. ఈ కేసుపై మంగళవారం నాడు విచారణ చేపట్టిన ఏసీబీ స్పెషల్ కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలు లో ఉన్నందున ఆయన కోర్టుకు హాజరుకాలేకపోయారని న్యాయవాదులు పేర్కొన్నా రు. ఈ కేసులో ఇతర నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ కోర్టుకు హాజరయ్యా రు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన ఏసీబీ మొత్తం 960 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. కేసులో నిందితుల పాత్ర అసలు సూత్రధారులకు సంబంధించిన కీలక విషయాలను చార్జిషీట్‌లో అధికారులు
పొందుపరిచారు. కేసులో ఆడియో టేపులకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను సైతం కోర్టుకు అప్పగించారు. ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి ఇవ్వాలని చూసిన డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే అంశమే కీలకం కానుంది. 2015లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బులతో ప్రలోభపెట్టారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది.