క్రైమ్/లీగల్

ఏటీఎం కార్డుల క్లోనింగ్ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 17: హైక్లాస్ రెస్టారెంట్‌లు, పబ్బులలో వెయిటర్‌గా పని చేస్తు బిల్లు చెల్లించే సమయంలో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి డబ్బు డ్రా చేస్తున్న ఒడిషాకు చెందిన ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.10 లక్షల నగదును స్కిమర్, క్లోనింగ్ మిషన్‌తో పాటు నకిలీ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒడిషాలోని గంజాం జిల్లా గొలంతరకు చెందిన ప్రపుల్ కుమార్ నాయక్ (25) హేమంత్ కుమార్ నాయక్ (28) సుజిత్ కుమార్ నాయక్ (31) ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారని, నిందితులు ముగ్గురు 10వ తరగతి వరకు చదువుకున్నట్లు డీసీపీ చెప్పారు. ప్రధాన నిందితుడు ప్రపుల్ కుమార్ గొలంతర గ్రామంలో ఎక్కువ మంది సైబర్ నేరగాళ్లు ఉండడంతో వారి వద్ద ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేయడం నేర్చుకున్నాడు. స్నేహితులైన హేమంత్, సుజిత్‌కు ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి సులువుగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పి నగరానికి తీసుకొచ్చాడు. నిందితులు ఆన్‌లైన్‌లో స్కిమర్, క్లోనింగ్ మిషన్ కోనుగోలు చేశారు. ప్రధాన నిందితుడు ప్రపుల్ కుమార్ హైక్లాస్ పబ్‌లు, రెస్టారెంట్లలో పని చేస్తూ కస్టమర్లు బిల్లులు చెల్లించేటప్పుడు తమ వెంట తెచ్చుకున్న స్కిమర్ సహాయంతో కార్డులోని డేటాను తస్కరించేవాడు. ఇంట్లో ఉన్న హేమత్ కుమార్ స్కిమర్‌ని ఇస్తే నకిలీ ఏటీఎం కార్డులోకి డేటాను మార్చేవాడు. అనంతరం సుజిత్ కుమార్ నకిలీ డిబెట్ కార్డులతో ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసేవాడని డీసీపీ తెలిపారు. గచ్చిబౌలి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగు చూసినట్లు ప్రియదర్శిని చెప్పారు. నిందితులు 31 బ్యాంకులకు చెందిన రూ.13 లక్షలు మోసం చేసినట్లు డీసీపీ వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ప్రపుల్ కుమార్ నాయక్ చెన్నైతో పాటు నగరంలోని ఖరీదై పబ్‌లలో పని చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు డీసీపీ వెల్లడించారు. 10 సంవత్సరాల నుంచి నగరంలో నివాసముంటున్న ప్రపుల్ కుమార్ 2017 నుంచి క్లోనింగ్ మోసాలు చేస్తున్నట్లు తెలిపారు. ఖరీదైన పబ్‌లు రెస్టారెంట్లులో 10 రోజులు మాత్రమే పని చేసి మానేస్తాడని చెప్పారు. పబ్బులో వెలుతురు సరిగా ఉండదని అ సమయంలో కస్టమర్లు కార్డు ఇచ్చినప్పుడు తన జేబులో ఉన్న స్కిమర్‌లో డేటాను క్లోనింగ్ చేస్తాడని పేర్కొన్నారు. 31 బ్యాంకులను చెందిన 44 నకిలీ డిబెట్ కార్డులతో పాటు 140 క్లోనింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. నిందితుల వద్ద 150 మంది కస్టమర్ల బ్యాంకు సమాచారం సేకరించినట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు డీసీపీ తెలిపారు. ప్రజలు బిల్లు చెల్లించే సమయంలో కార్డులను చేతికి ఇవ్వవద్దని వెయిటర్ చూడకుండా పిన్ నెంబర్ ఎంటర్ చేయాలని సూచించారు. పబ్‌ల్లో మద్యం సేవించిన తరువాత కస్టమర్లు మత్తులో ఉండి కనీసం డెబెట్ కార్డును కూడా తీసుకోకుండా వెళ్లిపోతుండడంతో నిందితులకు సులువుగా పని అవుతుందని తెలిపారు. నిందితులు రూ.13లక్షలు మోసం చేయాగా రూ.10లక్షల 10వేలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. సైబర్ క్రైం పోలీసులు ఎక్కువ నగదును స్వాధీనం చేసుకున్న మొదటి కేసని అన్నారు. కార్యక్రమంలో ఏడీసీపీ కవిత, ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐలు శ్రీనివాస్, చంద్రశేఖర్, ఎస్‌ఐలు విజయ్ వర్ధన్, గౌతం పాల్గొన్నారు.