క్రైమ్/లీగల్

సుప్రీం కోర్టులో మధ్యప్రదేశ్ భవితవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించిన మేరకు శాసనసభలో బలపరీక్ష జరపాలా? వద్దా? అనే అంశంపై అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో హోరాహోరీ పోరాటం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతుంటే అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశం మేరకు వేంటనే బలపరీక్ష జరుగకుండా చూసేందుకు కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శాసన సభలో వెంటనే బలపరీక్ష జరపాలని బీజేపీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులు చంద్రచూడ్, హేమంత్ గుప్తాతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారంనాడు ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. బీజేపీ తీసుకెళ్లిపోయిన 16 మంది తమ పార్టీ శాసన సభ్యులు
వెనక్కురావాలని, ఆరుగురు మంత్రుల రాజీనామాతో శాసన సభలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసిన తరువాతే బలపరీక్ష జరపటం సాధ్యం అవుతుంది కాంగ్రెస్ వాదిస్తోంది. బీజేపీ మాత్రం బలపరీక్ష కోసం ఆరు నెలల వేచి ఉండాలనడం రాజ్యాంగ విరుద్ధమని అంటోంది. 16 మంది శాసన సభ్యులు తమ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తోంది. దీంతోపాటు శాసన సభలో బలపరీక్ష జరిపి ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు మెజారిటీ ఉన్నదా? లేదా? అనేది వెంటనే తేల్చాలని కమలనాథులు సుప్రీం కోర్టులో వాదిస్తున్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తోందని కాంగ్రెస్ సుప్రీం కోర్టులో ఆరోపించింది. మధ్యప్రదేశ్‌లోని 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే తమ శాసన సభ్యులను ఎత్తుకుపోయిందని కాంగ్రెస్ తరపున వాదించిన ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. ఆరుగురు శాసన సభ్యుల రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేంత వరకూ బీజేపీ కోరుతున్న బలపరీక్ష జరపకూడదని దవే వాదించారు. ఇలా ఉండగా మంగళవారమే శాసన సభలో బలపరీక్ష జరపాలని గవర్నర్ టాండన్ అర్థరాత్రి ఎలా ఆదేశిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? కాంగ్రెస్ శాసన సభ్యులను ఎత్తుకుపోయినా బలపరీక్ష జరపాలా? ఆని దవే ప్రశ్నలు కురిపించారు. ‘ కాంగ్రెస్ శాసనసభ్యులను ప్రలోభాలతో బీజేపీ బెంగళూరుకు ఎత్తుకుపోయింది. ఇది జరిగిన వెంటనే బీజేపీ నాయకులు గవర్నర్‌ను కలిసి శాసన సభ్యుల రాజీనామాలను అందజేశారు’అని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్ శాసన సభ్యులు లేకున్నా వారి రాజీనామాలను గవర్నర్‌కు బీజేపీ అందజేయడం విచిత్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జరుగుతున్న కుట్రలో బీజేపీ భాగస్వామి అనేందుకు ఈ నిదర్శనం చాలదా? అని దవే ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట మాటకు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనడాన్ని విస్మరించరాదని ఆయన గుర్తుచేశారు.
కాగా కాంగ్రెస్ పార్టీ బలపరీక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది ముకుల్ రొహత్గీ అన్నారు. ఆరుగురు మంత్రుల రాజీనామాతోపాటు మిగతా 16 మంది శాసన సభ్యులు కూడా రాజీనామా చేసిన తరువాత అధికారంలో కొనసాగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు ఎంత మాత్రం లేదని ఆయన అన్నారు. ఎమర్జన్సీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు, అధికారం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రానికి రాజ్యాంగపరమైన అధినేతైన గవర్నర్‌కు ప్రభుత్వం నడిచేలా చూడవలసిన బాధ్యత గూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు రకరకాల ఎత్తులు వేస్తోందని ఆయన కోర్టుకు వివరించారు. స్పీకర్ ప్రజాపతి తరపున హాజరైన అభిషేక్ సింఘ్వీ తన వాదన వినిపిస్తూ శాసన సభ్యులు అందజేసిన రాజీనామాల్లో చాలా సారూప్యాలున్నాయి, వీటిని చూస్తుంటే రాజీనామాలు నిజం కావనే అనుమానం కలుగుతోందని కోర్టుకు చెప్పారు. 19 రాజీనామాల్లో ఆరు రాజీనామాలను ఒకే వ్యక్తి రాసినట్టుందని ఆయన తెలిపారు. బీజేపీ శాసన సభ్యుల నుంచి రాజీనామాలను బలవంతంగా తీసుకున్నదని సింఘ్వీ ఆరోపించారు. బలపరీక్ష జరపాలని గవర్నర్ ఎలా ఆదేశిస్తారని దవే ప్రశ్నించారు. బీజేపీ ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ శాసన సభ్యులను ఎత్తుకుపోయి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దావే ఆరోపించారు. ఈదశలో న్యాయమూర్తి హేమంత్ గుప్తా జోక్యం చేసుకుని ‘16 మంది శాసన సభ్యులు రాజీనామా చేస్తే మీరేందుకు అభ్యంతరం చెబుతున్నారు?’అని ప్రశ్నించారు. ముకుల్ రొహత్గీ మాట్లాడుతూ 16 శాసన సభ్యులు కాంగ్రెస్‌తో ఉండేందుకు ఇష్టపడటం లేదన్నారు. బలపరీక్షకు ముఖ్యమంత్రి అంగీకరించకపోతే ఆయనకు మెజారిటీ లేదనే అభిప్రాయం కలుగుతుందనేది బొమ్మై కేసులో ఇచ్చిన తీర్పు స్పష్టం చేస్తోందని రొహత్గీ అన్నారు. 16 మంది కాంగ్రెస్ శాసన సభ్యుల తరపున హాజరైన న్యాయవాది మణీందర్ సింగ్ మాట్లాడుతూ శాసన సభ్యులు కిడ్నాప్ కాలేదని స్పష్టం చేశారు. వారికి రాజీనామా చేసే అధికారం ఉందని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ గురువారం కూడా సాగుతుంది.