క్రైమ్/లీగల్

తేనెటీగల దాడిలో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, మార్చి 18: తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి చెందాడు. జిల్లేడు చౌదరిగూడ ఏఎస్‌ఐ సత్యనారాయణ గౌడ్ కథనం ప్రకారం.. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన మచ్చ చంద్రయ్య (33) అనే వ్యక్తితోపాటు మరో ముగ్గురు యువకులు బంధువుల ఇంటికి చౌదరిగూడకు మంగళవారం సాయంత్రం వచ్చినట్లు వివరించారు. గ్రామ సమీపంలో ఉన్న ఒక చెట్టుకు తేనె తీసేందుకు వెళ్లగా తేనె టీగలు ఒక్కసారిగా వచ్చి దాడి చేయడంతో మచ్చ చంద్రయ్య తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురు యువకులు పరుగులు తీశారు. గురువారం ఉదయం చూసే సరికి మచ్చ చంద్రయ్య మృతి చెందినట్లు వివరించారు. తన భర్త మృతిపై అనుమానం ఉందని భార్య సత్తమ్మ ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.