క్రైమ్/లీగల్

సీఐ, నలుగురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 18 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏకే 47, కార్బన్ తుపాకుల మాయం ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, నలుగురు కానిస్టేబుళ్లపై పోలీసు అధికారులు వేటు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జనవరి 6న రాత్రి దేవిని సదానందం అనే వ్యక్తికి పొరుగున ఉన్న గుంటి గంగరాజుతో గోడ విషయమై వివాదం చెలరేగింది. దీంతో సదానందం హఠాత్తుగా లోపలికి వెళ్లి ఏకే-47 తీసుకువచ్చి గుంటి గంగరాజుపై కాల్పులు జరిపాడు. అయతే గంగరాజు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీంతో అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసు అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సదానందంకు తుపాకులు ఎక్కడి నుండి వచ్చాయని విచారించారు. ఆ ఏకే 47, మరో తుపాకి హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ నుండి అపహరించినట్టు సదానందం అంగీకరించాడు. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తుపాకుల మాయం కేసు ఘటనపై విచారణ అధికారిగా నియమించారు. ఏసీపీ రామేశ్వర్ విచారణలో అప్పటి పోలీసు అధికారుల నిర్లక్ష్యం మూలంగానే పోలీస్‌స్టేషన్ నుండి సదానందం తుపాకులు అపహరించికెళ్లినట్టు నిర్ధారించారు. అప్పటి హుస్నాబాద్ ఎస్‌ఐ, ప్రస్తుత సీఐ సంజయ్, ఏఎస్‌ఐ మణెమ్మ, హెడ్ కానిస్టేబుళ్లు సంపత్, మనోజ్, అశోక్‌లపై పోలీసు అధికారులు వేటు వేశారు. మూడు రోజుల కిందట ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉంచటం గమనార్హం.