క్రైమ్/లీగల్

రంజన్ గొగోయ్ నామినేషన్‌పై సుప్రీంలో ‘పిల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ నామినేట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ విద్యావేత్త మధు పూర్ణిమా కిష్వార్ బుధవారం సుప్రీం కోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం (పిల్) దాఖలు చేశారు. రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం వలన న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని అమె తమ ‘పిల్’లో వాదించారు. న్యాయ వ్యవస్థ స్వాతంత్రంపై అనుమానాలు కలిగేందుకు గొగోయ్ నామినేషన్ ఆస్కారం కలిగిస్తోందని కిష్వార్ తెలిపారు. ఈ కారణాల చేత రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై స్టే ఇవ్వాలని ఆమె సుప్రీం కోర్టుకు విజప్తి చేశారు. పదవీ విరమణ చెందిన న్యాయమూర్తులకు వెంటనే పదవులు ఇవ్వటం న్యాయ వ్యవస్థ స్వాతంత్రంపై మచ్చలాంటిదని రంజన్ గొగోయ్ గతంలో స్వయంగా చెప్పారని కిష్వార్ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం మరింత వివాదాస్పదం అయ్యిందని ఆమె తమ పిటిషన్‌లో తెలిపారు. రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం వలన న్యాయ వ్యవస్థను మరింత అపఖ్యాతిపాలు చేసే అవకాశం భారత వ్యతిరేక శక్తులకు లభిస్తుందని కిష్వార్ తమ పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం వంటి పెద్ద తప్పును ఎందుకు చేసిందని కిష్వార్ ప్రశ్నించారు.
*చిత్రం...సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌