క్రైమ్/లీగల్

ఎస్‌ఐ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 19: వ్యక్తిగత కారణాలతో సీఆర్‌పీ ఎఫ్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భవాని శంకర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. సెలవులపై స్వంత ఊరికి వెళ్లిన శంకర్ గత పదిరోజుల క్రితమే డ్యూటీలో చేరారు. గురువారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఊరి బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.