క్రైమ్/లీగల్

మందస వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జనవరి 4: శ్రీకాకుళం జిల్లా మందస సమీపంలో విశాఖ నుంచి బరంపూర్ వెళ్తున్న కారు అతివేగంతో అదుపు తప్పి వంతెనపైనుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సింహాచలం క్షేత్రాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా మార్గమాధ్యంలో వీరిని మృత్యువు కాటేసింది. శ్రీకాకుళం జిల్లా మందస పరిధి కొత్తపల్లి జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ దుర్ఘటనలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన డ్రైవర్ దొండపాణి
ప్రతాప్(29), భార్య రీతూ(25), భనితజెన్నా(25), భనితజెన్నా కుమారుడు ఆదర్శ కుమార్ జెన్నా(3), డ్రైవర్ మరదలు గీతారాణి దాస్(20) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఇదే సంఘటనలో స్వల్పగాయాలతో మరొకరు బయటపడ్డారు. పోలీసుల కథనం మేరకు భువనేశ్వర్ నుంచి సింహాచలానికి వెళ్లి మొక్కు తీర్చుకొని శుక్రవారం రాత్రి 11 గంటలకు సింహాచలంలో బయలుదేరారు. జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును డ్రైవర్ ఢీకొనడంతో కారు పంట కాలువలోకి దూసుకువెళ్లింది. కారులో వున్న వారంతా ఊపిరాడక మృతి చెందినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. మృతదేహాలను సోంపేట ప్రభుత్వాసుపత్రిలో భద్రపరిచారు. స్వస్థలానికి మరో నాలుగు గంటల్లో చేరుకునే సమయానికి మృత్యువు వీరిని కాటేసింది. గతంలో కూడా ఈ ప్రాంతంలో నిద్రిస్తున్న రైతులపై లారీ దూసుకువెళ్లడంతో రైతులు మృతి చెందిన ఘటన పాఠకులకు విదితమే.

''చిత్రాలు..పంట కాలువలో పడిన కారు వద్ద సహాయక చర్యలు
*కారు లోపలి నుంచి బయటకు తీసిన మృతదేహాలు (ఇన్‌సెట్‌లో )