క్రైమ్/లీగల్

ఆస్తి వివాదంలో భార్యను చంపిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 3: కష్టించి సంపాధించిన విలువైన ఆస్తిని తన భార్య ఆమె మేనల్లుడుకి అప్పనంగా ఇస్తుందనే కోపంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. ఈసంఘటన సోమవారం వేకువజామున స్థానిక రేచర్లపేటలో చోటుచేసుకుంది. హత్యా ఉదంతానికి సంబంధించి కాకినాడ డిఎస్పీ రవివర్మ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రేచర్లపేటలో నరుకుర్తి నాగరాజు, అప్పయ్యమ్మ(60) అనే వృద్ద దంపతులు నివాసం ఉంటున్నారు. నాగరాజు మొదటి భార్య చనిపోవడంతో సుమారు 35 సంవత్సరాలు క్రితం అప్పయ్యమ్మను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేకపోవడం అప్పయ్యమ్మ తన మేనల్లుడుపై ప్రేమానురాగాలు పెంచుకుని పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో తన పేరిట ఉన్న రెండు ఎకరాల భూమిలో 40సెంట్ల భూమి ఒకసారి, 50సెంట్ల భూమిని మరోసారి రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా ఇచ్చింది. రేచర్లపేటలో ఉన్న రెండు అంతస్థుల భవనాన్ని సైతం తన మేనల్లుడు పేరిట రాసి ఇస్తానంటూ అప్పయ్యమ్మ తన భర్త నాగరాజుతో కొంతకాలంగా చెబుతోంది. దీంతో వృద్ధ దంపతుల మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకంపై వివాదం జరుగుతోంది. ఈవివాదం ఇరువురు మధ్య ఆదివారం రాత్రి తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. పంట భూమితోపాటు తాను ఎంతోకష్టించి నిర్మించుకున్న ఇంటిని సైతం తనకు ఉంచకుండా భార్య తన మేనల్లుడికి రాసి ఇస్తే తాను వృద్ధాప్యంలో ఎక్కడ ఉండాలని నాగరాజు ఆంధోళనకు గురై ఉండవచ్చని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తపరిచారు. తన భార్యను కడతేరిస్తే ఆస్తిపంపకం సమస్య తీరుతుందని భావించిన అతను సోమవారం వేకువ జామున పదునైన ఆయుధంతో నిద్రమత్తులో ఉన్న భార్యను హత్యచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం నింధితుడు నాగరాజు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెల్లి లొంగిపోయినట్లు తెలిసింది. మృతురాలు అప్పయ్యమ్మ గల్ఫ్‌దేశంలో కొంతకాలంపాటు పనిచేసినట్లు తెలిసింది. నాగరాజు నగరపాలక సంస్థలో పనిచేసి పదవీవిరమణ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్య విషయం తెలిసిన వెంటనే డిఎస్పీ రవివర్మ, టూటౌన్ సిఐ ఎండి ఉమర్‌లు హుటాహుటీన సంఘటనా ప్రాంతానికి చేరుకుని హత్యకు గల కారణాలపై విచారించారు. భార్య భర్తలు మధ్య ఆస్తి విషయమై వివాదం జరుగుతోందని, భార్య విలువైన ఆస్తిని మేనల్లుడికి రాసి ఇస్తుందనే కారణంతో నాగరాజు తన భార్యను హత్యచేసినట్లుగా భావిస్తున్నట్లు డిఎస్పీ రవివర్మ చెప్పారు. కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో ఇతర కారణాలు ఉంటే వెలుగులోకి వస్తాయన్నారు. సిఐ ఉమర్ ఈసంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.