క్రైమ్/లీగల్

సింగరేణి సిహెచ్‌పీలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్ నవంబర్ 19: శ్రీరాంపూర్‌లోని సింగరేణి కోల్ హడ్లింగ్ ప్లాంట్ సిహెచ్‌పిలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సీ- 7 బెల్ట్ దగ్ధం కాగా కోట్ల రూపాయల నష్టాన్ని అధికారుల అప్రమత్తతో కాపాడారు. ఏరియా జీ ఎం సుభానీ కథనం ప్రకారం సీ- 7కన్వీల్ బెల్ట్ ద్వార వివిధ గనుల నుండి వచ్చిన బొగ్గును లోడింగ్ పాయింట్‌కు తరలిస్తు రేల్వే వ్యాగన్ల ద్వారా సప్లై చేస్తారు. సీ 7 బెల్ట్‌మార్గంలో స్పిడ్ కష్టింగ్ లలో టెంపరేచర్ పెరిగింది.స్పిడ్ కప్టింగ్ సిస్టమ్‌లోవిల్స్ అయిల్ వేడి కావడంతోసీ-7 బెల్ట్ పై పడింది.వీల్స్ డ్రమ్‌కు మద్య ఉన్న స్పీడ్ కష్టింగ్‌లో ఏర్పడిన ఉష్ణోగ్రత వల్లఅయిల్ బెల్ట్‌పై పడటంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమై బెల్ట్ వద్ద పని చేస్తున్న కార్మికులు సీహెచ్‌పి డిజిఎం రామలింగంకు సమాచారం అందించారు. అయన వెంటనే అధికారులకు సమాచారం అందించారు అన్ని గనుల మేనేజర్లు,ఏజంట్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల, జైపూర్ నుండి ఫైర్ ఇంజన్ల్‌ను రప్పించి, రెస్క్యూ సిబ్బంది అప్రమత్తంతోరంగంలోకి దిగిన అధికారులు ఉద్యోగులు ఫైర్ సిబ్బంది, రెస్క్యూ రక్షణచర్యలు చేపట్టి మంటలను ఆర్పివేశారు. దీంతో ఇతర ప్రాంతంలో ఉన్న బొగ్గుకు అంటుకోకుండా నివారించారు. సుమారు 50 కోట్లవిలువైన సిహెచ్‌పి ప్లాంట్‌లోడింగ్‌పాయింట్ అగ్ని ప్రమాదంలో దగ్ధం కాకుండా సురక్షితంగా బయటపడింది.సీ-7 బెల్ట్ దగ్ధం కావడంతో దాదాపు రెండు లక్షల వరకు నష్టంవాటిలిందని అధికారులు తెలిపారు. బొగ్గు రవాణాకు అంతరాయ కలగకుండా వర్కషాప్ అధికారులు, ఇంజనీర్లు వచ్చిమరమత్తులు పనులు చేపట్టారు. మంగళవారం వరకు బొగ్గురవాణా కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటామని జీఎం పేర్కొన్నారు.